![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -259 లో...సీతాకాంత్ ఆఫీస్ కి డల్ గా వస్తాడు. ఇక దొరికింది ఛాన్స్ అని నందిని ఏం జరిగిందని అడుగుతుంది. రామలక్ష్మికి ఆస్తులపై ప్రేమ పెరిగింది.. నా వాళ్ళు అంతా ఆస్తి కోసమే నాతో ఉంటున్నారని అనుకుంటుంది.. అందుకే ఇక ఇదంతా వదిలేసి మళ్ళీ నా తల్లితో ఉండి మళ్ళీ ఆస్తులు సంపాదించాలి. అప్పుడే ఏం లేకున్నా నా తల్లి నాతో ఉందని రామలక్ష్మికి నిరూపించాలని సీతాకాంత్ అంటాడు.
నందిని తనకి హెల్ప్ చేస్తానని అంటుంది. స్టార్టప్ కంపెనీ ఇస్తుంది. దాంతో నందినికి సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఏంటి రామలక్ష్మి ఇలా చేస్తున్నావ్.. మోసం చేసి ఆస్తులు రాయించకొని సీతాని బాధపెడుతున్నావని నందిని అడుగగా.. తప్పట్లేదు అని రామలక్ష్మి అంటుంది. ఇక రామలక్ష్మికి సీతాకాంత్ సీఈఓకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసి.. అప్పుడే లాయర్ రూల్స్ చెప్తాడు. సడెన్ గా ఇలా రాజీనామా చేస్తే కంపెనీకి పది కోట్లు ఇవ్వాలి లేదా.. జైలు శిక్ష ఉంటుంది.. అలా కాకుండా ఆరు నెలలు నోటిస్ పీరియడ్ ఉంటుందని లాయర్ అనగానే.. అంటే సీతాని జైల్లో కి పంపిస్తావా అని నందిని అడుగుతుంది. ఎక్కడికి వెళ్లాలో ఆయనే నిర్ణయం తీసుకోవాలని రామలక్ష్మి అంటుంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా నేను ఆఫీస్ లో ఉండాలని కావాలనే చేస్తున్నావని సీతాకాంత్ అనుకుంటాడు.
సరే నేను ఇక్కడే ఉండి నేను చెయ్యాలిసింది చేస్తానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ఇంట్లో పనులన్నీ చేసి అలిసిపోతారు. ఇక రామలక్ష్మి, సీతా బావని మనమే ఒకటి చెయ్యాలి. అప్పుడే రామలక్ష్మి అక్క మనల్ని వదిలేస్తుందని శ్రీవల్లి అనగానే.. అలా ఏం వద్దంటూ శ్రీలత మరొక ప్లాన్ వేస్తుంది. సీతాకాంత్ వచ్చేసరికి చెయ్యి, కాలి నొప్పితో బాధపడుతుంది. ఏమైంది ఎవరు వంట చెయ్యమన్నారని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి అక్క చేయమందంటూ శ్రీవల్లి చెప్పగానే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. పదా అమ్మ ఇంట్లో నుండి వెళ్లిపోయి.. నువ్వు ఎలాంటి ఆస్తులు లేకున్నా నాతో ఉంటారని నిరూపిస్తానని సీతాకాంత్ అనగానే.. వద్దని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |